పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన జలంధర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. ఆయన ప్రయాణిస్తున్న పడవ నదిలో ఓ వైపునకు ఒరిగిపోయింది. ఇలా కాసేపు ఆ పడవ అటూఇటూ ఊగింది. రద్దీ ఎక్కువ కావడంతో ఇలా జరిగింది. అయితే బోటు తిరిగి నియంత్రణలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa