ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం 240 కోట్ల మంది ఆహారకొరతను ఎదుర్కొన్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 78.3 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారని.. 14.8 కోట్లమంది పిల్లల్లో ఎదుగుదల లోపించినట్లు 'ఆహార భద్రత పరిస్థితి.. పోషకాహారం - 2023' నివేదికలో తెలిపింది. కరోనానుంచి కోలుకునే క్రమంలో ప్రపంచమంతటా ఒకేలా లేదు. అలాగే ఉక్రెయిన్లో యుద్ధం కూడా పోషకాహారం, ఆహార పరిస్థితులపై ప్రభావం చూపిందని తెలిపింది.