కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ముసాయిదా రూపొందించిన తర్వాత దానిపై స్పందిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దీనిపై మూడోసారి సమావేశాన్ని శనివారం ఆ పార్టీ నేతలు ఢిల్లీలో నిర్వహించారు. చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తంఖా, కేటీఎస్ తులసి, మనీష్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. యూసీసీపై ఇప్పటికే పలు పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.