జనసేన అధినేత పవన్ కల్యాణ్ నీచాతి నీచంగా, సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తణుకులో నిన్న వారాహి విజయయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. అలాగే నీకు హిందూ మతం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.