దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతుండడంతో కొంతమంది రైతుల పంట పండుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారారు. ఇదే తరహాలో మహారాష్ట్ర పుణె జిల్లాలోని తుకారాం భాగోజీ గయాకర్ అనే రైతు 13 వేల క్రేట్ల టమాటాలను నెల రోజుల్లో అమ్మి కోట్లు గడించాడు. వాటిని అమ్మగా రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చింది. తుకారాం 12 ఎకరాల్లో టమాటా పంటను పండించాడు.