తాడిపత్రి మండలంలో పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. మండల పరిధిలోని హుసేనాపురం గ్రామ సమీపంలో సెబ్ సీఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్ ను పట్టుకుని హర్షవర్ధన్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం తాడిపత్రి రూరల్ పోలీసులకు ట్రాక్టర్ ను అప్పగించినట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.