భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని.. ఇవాళ యూఏఈలో అడుగుపెట్టారు. అబుదాబి విమానాశ్రయంలో మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మోడీతో అబుదాబి రాజు సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, డిఫెన్స్‌పై చర్చిననున్నట్లు తెలుస్తోంది.