ఘర్షణలు జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని డిఎస్పి గంగయ్య శనివారం పేర్కొన్నారు. పెద్దపప్పూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మంది రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిపించి డి. ఎస్. పి గంగయ్య వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి. ఎస్. పి మాట్లాడుతూ రాబోయే మొహరం పండుగ సందర్భంగా గ్రామాలలో ఘర్షణలు జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలని సూచించారు.