మౌంట్ కార్మెల్ మాత మహోత్సవం సందర్భంగా ఈ నెల 7 వ తేదీన నవదిన ప్రార్థనలు ప్రారంభించారు. శనివారం సాయింత్రం నవదిన ప్రార్థనలు చివరి రోజు కానూరు, కామయ్యతోపు పురవీధుల్లో కార్మెల్ మత స్వరూపం తేరు ఉరేగుంపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దివ్య బలి పూజను నిర్వహించారు. రేపు 16 వతేది కార్మెల్ మాత మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని విచారణ గురువు ఫాదర్. సలివెంద్ర సౌరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్య స్త్రీలు, కౌన్సిల్ సభ్యులు, ఉపదేశకులు, యూనిట్ లీడర్స్, గంగూరు, పోరంకి, సాలి పేట, కామయ్యతోపు, కానూరు నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కార్మెల్ మాత పుణ్యక్షేత్రం గురువు. ఫాదర్. సలివెంద్ర.సౌరి తెలిపారు.