ఏపీకి ఐపీఎల్ టీమ్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కొత్త ఫ్రాంఛైజీలకు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తుండటంతో బిడ్డింక్ దక్కించుకోవాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. దీనికోసం పారిశ్రామిక వేత్తలతో కలిసి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. విశాఖలోని స్టేడియం ఏపీ హోం గ్రౌండ్ అవుతుందని పేర్కొన్నారు.