వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న రెండు, మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా రుతుపవనాలు ప్రయాణిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ నెల 18, 19 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.