ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడి తలలో దూసుకెళ్లిన మేకును వైద్యులు 6 గంటలపాటు శ్రమించి తీసేసిన ఘటన తమిళనాడులో జరిగింది. నవలూర్ లో ఓ పరిశ్రమలో పనిచేస్తున్న బ్రహ్మ అనే వ్యక్తి తల వెనుక భాగం లోకి ఓ మేకు దూసుకెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు 6 గంటపాటు శ్రమించి దాన్ని తీసివేశారు. కపాలం, వెన్నెముకలు కలిసే చోట మేకు దిగిందని, కొంచెం పొరపాటు జరిగినా ప్రాణం పోయేదని వైద్యులు తెలిపారు.