స్నేహితులతో కాసిన పందెం యువకుడి ప్రాణం తీసిన ఘటన బీహార్ లో జరిగింది. తూర్పు చంపారన్ జిల్లాలోని సిహోర్వాకు చెందిన విపిన్ కుమార్(25) సివాన్ జిల్లాలోని గ్యానీమోర్ లో మొబైల్ రిపేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. విపిన్ తన స్నేహితులతో పందెం కాసి ఏకంగా 150 మోమోలు తిన్నాడు. దీంతో అస్వస్థతకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. అయితే, విపిన్ ను విషం పెట్టి చంపారని అతని తండ్రి ఆరోపిస్తున్నాడు.