ఆఫ్రికాలో ఎత్తయిన కిలిమంజారోను కోనసీమ కుర్రాడు అధిరోహించాడు. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన పసుపులేటి నాగసతీష్ (19)కు పర్వతారోహణ అంటే ఇష్టం. హిమాలయాల్లో శిక్షణ తీసుకున్నాడు. నాగసతీష్ తన తొలి సాహసయాత్రను టాంజానియాలోని కిలిమంజారో పర్వతంలో మొదలుపెట్టాడు. కిలిమంజారోను 3 రోజుల్లో రెండు సార్లు అధిరోహించి ఆ పర్వతంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ మేరకు నాగసతీష్కు ‘ప్రపంచ యువ పర్వతారోహకుడి’గా గుర్తింపు ఇచ్చారు.