సినీఫక్కీలో గంజాయి తరలించి, బెంగళూరులో విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన చంద్రభాన్ బిష్ణోయి, విశాఖవాసి లక్ష్మీమోహన్ దాస్ ఏపీ-ఒడిశా సరిహద్దులో గంజాయి సేకరించి, గూడ్సు వాహనంలో ఓ రహస్య అర ద్వారా బెంగళూరుకు తరలించేవారు. మార్గమధ్యలో వాహననంబరు మారుస్తూ జాగ్రత్తపడేవారు. వీరినుండి గంజాయి తీసుకున్న వ్యక్తి బెంగళూరులో విక్రయిస్తుండగా అధికారులు పట్టుకొని విచారణ చేయడంతో అసలు కథ బయటపడింది.