ధర్మవరం పట్టణం సత్య సాయి నగర్ లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని వార్డు ప్రజలు వాపోతున్నారు. ఇంటి నుండి బయటకు రావాలంటే గుంపులుగా ఉన్న వీధి కుక్కలతో బేజారు పడుతున్నామని, ఎప్పుడు ఏ కుక్క వచ్చి కరుస్తుందేమోనని భయంతో బతుకుతున్నామని వార్డ్ ప్రజలు వాపోయారు. మున్సిపాలిటీ వారు స్పందించి వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ గాని లేదంటే బయట ప్రదేశానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa