నరసాపురం-గుంటూరు మధ్య నడిచే (17281-17282) ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సోమవారం నుంచి పట్టాలు ఎక్కనున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు విజయవాడ వరకే నడపనున్నారు. తర్వాత గుంటూరుకు పొడిగిస్తారు. విజయవాడ-గుంటూరు మధ్య ట్రాక్ పనుల కారణంగా గత నెల 13 నుంచి దీనిని నిలిపివేశారు. పాత షెడ్యూలు ప్రకారం నరసాపురంలో ఉదయం ఆరు గంటలకు, తిరిగి విజయవాడలో సాయంత్రం 6. 15 ఈ రైలు బయలుదేరుతుంది.