గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడును ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ స్కోరింగ్ కార్మికులకు, ఉద్యోగులకు బ్యాంకుల నుండి లోన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మేయర్ కు వినతిపత్రాన్ని అందచేశారు.