పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)లో పనిచేస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. మహ్మద్ రయీస్ అనే నిందితుడు తన పాకిస్థాన్ హ్యాండ్లర్లకు భారత సైనిక స్థాపనలకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందిస్తున్నాడని యూపీ ఏటీఎస్ ఆదివారం తెలిపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోండాలోని తారాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ రయీస్, అర్మాన్ ముంబైలో పనిచేస్తున్నప్పుడు అతనితో పరిచయం ఏర్పడింది. భారతదేశంలోని ముస్లిం సమాజ సభ్యులపై అణచివేతకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ అర్మాన్ తనను ప్రేరేపించడానికి ప్రయత్నించాడని రయీస్ పోలీసులకు చెప్పాడు.