జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుడిపై దాడి చేసినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న పవన్, అక్కడినుండి తిరుపతికి వచ్చారు. పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు.