కర్నూలు జిల్లా, హలహర్వి మండలం, విరుపాపురం గ్రామానికి చెందిన రఫీక్ స్నేహితుడు అదే గ్రామానికి చెందిన యువతిని ఎత్తుకెళ్ళి వివాహం చేసుకొవడంతో, నెల క్రితం యువతి తల్లిదండ్రులు హలహర్వి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వివాహానికి రఫీక్ సహకరించాడనే అనుమానంతో హలహర్వి ఏఎస్ఐ (ASI) రఫీక్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చితకబాదారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక రఫీక్ పురుగుల మంది తాగాడని , తన తల్లిదండ్రులు ఆరోపించారు. ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.