రైల్వేశాఖ మరో ముందడుగు వేసింది. త్వరలోనే సామాన్యుల కోసం వందే సాధారణ్ రైళ్లను ప్రవేశ పెట్టనుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ మాల్యా వీటిని అక్టోబరులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. నాన్ ఏసీ రైలైన వందే సాధారణ్‌కు 22 కోచ్‌లు ఉంటాయి. రెండువైపులా ఇంజన్లుంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఇక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.