టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా జనంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ‘ఓటు మన బాధ్యత... ఓటుతో భద్రత....ఓటుతోనే భవిష్యత్తుకు భరోసా!’ అని తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరుగనుందని.. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫికేషన్ చేపడతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా మీ పేరు వెంటనే నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.