ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగి, వరద నీరు జనావాసాల్లోకి చేరుతుంది. మధ్యప్రదేశ్ లో వరద బీభత్సానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఖండ్వా జిల్లాలో భారీగా వర్షం కురువడంతో వరద ప్రభావానికి నిర్మాణంలో ఉన్న రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.