తిరుపతి జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులలో నగదు రహిత లావాదేవీలు అమల్లోకి వచ్చినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బార్డర్ ట్యాక్స్, టెంపరరీ పర్మిట్ ఫీజు, వలంటరీ ట్యాక్స్, అపరాధ రుసుం తదితర చెల్లింపులు క్యూఆర్ కోడ్ ద్వారా కానీ శాఖాపరమైన వెబ్సైట్లో కానీ చెల్లించాలని పేర్కొన్నారు. ఇకపై నగదు లావాదేవీలను అనుమతించేది లేదన్నారు.