2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును సీఎం జగన్ సమీక్ష చేసారు. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ 91శాతం లక్ష్యం చేరిన జీఎస్టీ (కాంపెన్‌సేషన్ కాకుండా) పన్నుల వసూళ్లు, అధికారుల వెల్లడి. జూన్ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని, గత ఏడాదిలో ఇదే కాలంతో పోలిస్తే 23.74 శాతం జీఎస్టీ వసూళ్ల పెరుగుదల కనిపించిందని అధికారులు వెల్లడించారు.