శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ దాడి ఘటన నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వినతిపత్రం అందజేశారు. పవన్‌తోపాటు బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీకాళహస్తి ఇన్చార్జి నగరం వినుత, మదనపల్లె ఇన్చార్జి రామదాస్ చౌదరితోపాటు అడ్వకేట్లు అమరనారాయణ, కంచి శ్యాములు ఎస్పీని కలిశారు.