తిరుమలలో భక్తుల కోరిక మేరకు ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను రోజుకు 4వేలు చొప్పున అదనంగా విడుదల చేస్తామని, ఇప్పటికే రోజుకు 20వేల టికెట్లను కేటాయించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారమే శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు రూ.880 కోట్లు విరాళాలు అందగా, ఈ నిధులతో దాదాపు 2,500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa