రాష్ట్రంలో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అధికారుల అవినీతి తారస్థాయికి చేరిందని సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి హెలెన్ ఆరోపించారు. నియోజకవర్గంలో అయితే రెవెన్యూ కార్యాలయంలో తలారీలు సైతం ప్రజలకు జవాబిచ్చే స్థితిలో లేరని విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు భయానకంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల బాగుకోసం చంద్రబాబుని సీఎం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసారు.