ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకి భరోసా ఇచ్చిన అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 17, 2023, 05:38 PM

రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ‘టీడీపీతోనే భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి పలాస నియోజకవర్గలో అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కార్యకర్తలూ అధైర్యపడొద్దు. అక్రమ కేసులకు భయపడొద్దు. రానున్నది టీడీపీ ప్రభుత్వమే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 150 సీట్లతో చంద్రబాబే సీఎంగా వస్తారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినవారికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వడ్డీతో సహా చెల్లిస్తా’మంటూ భరోసానిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com