కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఊమన్ చాందీ (80) ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున కన్నుమూశారు. ఊమన్ చాందీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చాందీ ఊమన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఊమన్ చాందీ క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది.