సేజల్ సూద్ అనే యూట్యూబర్ ఇటీవల ఓ ఎయిర్పోర్టులో మసాలా మ్యాగీ నూడుల్స్ ఆర్డర్ చేశాడు. దానికి ధర రూ.184 అయితే జీఎస్టీ రూ.9తో కలిపి మొత్తం బిల్లు రూ.193 అయింది. ఆ బిల్లు చూసిన సేజల్ సూద్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ బిల్లును ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్విట్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.