మణిపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో తూర్పు ఇంఫాల్‌లోని కెయిబి ప్రాంతానికి చెందిన లూసి మారిమ్ (55) అనే మహిళ చనిపోయింది. కాల్పుల అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. మహిళ హత్య కేసులో పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.