వివాహిత ఒకరు అదృశ్యమైనట్లు అరండల్ పేట ఠాణాలో సోమవారం కేసు నమోదైంది. అరండల్ పేటకు చెందిన నరసింహారావు ఓ విషయంలో భార్య వీణాసాయిని మందలించారు. దీంతో ఆమె అలిగి ఇంట్లో చెప్పకుండా ఆదివారం అర్ధరాత్రి దాటాక వెళ్లిపోయింది. భార్య ఆచూకీ కోసం బంధువులను ఆరా తీసినా ఉపయోగం లేకపోవడంతో నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.