జపాన్‌లో జననాల రేటు భారీగా పడిపోయింది. దాంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. జపాన్‌లో 2.1 జననాల రేటు ఉండాలి. కానీ ప్రస్తుతం 1.3 శాతం మాత్రమే ఉంది. అయితే 2010లో ITOCHU CORP సీఈఓ తీసుకున్న నిర్ణయం ఆ కంపెనీ ఉద్యోగుల బర్త్ రేట్ పెరిగేలా చేసింది. ఓవర్ టైమ్ ఉద్యోగాన్ని రద్దు చేసి.. రాత్రి 8 గంటల తర్వాత ఆఫీస్‌ను మూసేశారు. ఈ ఐడియా బాగా వర్కౌట్ అయింది. 2022 మార్చి 31 నాటికి సగటున ఒక్కో మహిళా ఉద్యోగికి ఇద్దరు పిల్లలు జన్మించారు.