ఏడాదిన్నర చెల్లిని మూడేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చి చంపేసింది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్లో మూడేళ్ల చిన్నారి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న గన్ తీసుకుని ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాల తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.