బెంగుళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశం పై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే. “సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేశాయి. యూపీఏ చేసిన తప్పులను మేం సరిదిద్దాం. కొన్ని పార్టీలు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నాయి. యూపీఏ హయాంలో గిరిజనుల అభివృద్దిని విస్మరించారు. బెంగుళూరులో సమావేశమై అధికారం కోసం పాకులాడుతున్నారు. 9 ఏళ్లలో దేశం గణనీయమైన అభివృద్ది సాధించింది.” అని మోడీ విమర్శించారు.