ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను తొమ్మిది నియోజకవర్గాల్లో నిర్వహించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. అందుకోసం సుమారు 22 రోజులు పడుతుందని అంచనా వేశారు. ఇప్పటికి 20వతేదీ వరకూ కనిగిరి నియోజకవర్గం వరకూ అధికారికంగా ఖరారుచేసిన విషయం విదితమే. ఆతర్వాత మార్కాపురం, ఎస్‌ఎన్‌పాడు, ఒంగోలు, అద్దంకి, దర్శి, వైపాలెం నియోజకవర్గాల నుంచి పల్నాడు జిల్లాలోకి ప్రవేశించే విధంగా రూట్‌మ్యాప్‌ను పరిశీలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ నాయకులతో చర్చల సందర్భంగా ఆ మేరకు రూట్‌మ్యాప్‌ను పరిశీలించాలని తన వ్యక్తిగత సిబ్బందిని లోకేష్ అదేశించారు.