తనపై , ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ విద్యార్థిని సోమవారం జాతీయ మహిళా కమిషన్‌కు, ఏయూ వీసీకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశోధన పత్రాలు సమర్పించే ప్రక్రియలో గైడ్‌గా చేయాల్సిన పనికి సదరు ప్రొఫెసర్ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందీ విభాగాధిపతిగా, తనకు గైడ్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ నల్లా సత్యానారాయణ ఒంటరిగా బయటకు రమ్మనడంతోపాటు అనేకసార్లు ఇబ్బందికర రీతిలో టచ్ చేశారని ఆరోపించారు.