మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ విశాఖ జిల్లా, వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అయన జనసేన పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 20న సాయంత్రం 4 గంటలకు జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. 20న మధ్యాహ్నం 3:30 గంటలకు జనసేన పార్టీ కార్యాలయానికి వెళతానని చెప్పారు. ఇక నుంచి తమ అధినేత పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే చేస్తానని ఆయన తెలిపారు.