పీఏసీఎ్‌సల ప్రైవేటీకరణను ఆపాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార ఉద్యోగులు సోమవారం చలో విజయవాడ చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ ధర్నాచౌక్ వద్ద జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. పీఏసీఎ్‌సల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, వేతన సవరణ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోని పీఏసీఎ్‌సలలో రైతులు మాత్రమే వాటాదారులుగా ఉండాలని, కానీ 50 శాతం వాటాలను ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు ఇస్తూ 1964 చట్టానికి చేసిన సవరణను రద్దు చేయాలన్నారు. సహకార సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎ్‌స.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు, రైతు సంఘం నేత వి.కృష్ణయ్య, ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు వి.రాధాకృష్ణ మూర్తి మాట్లాడారు.