కర్నూలు, ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామానికి చెందిన ఓ యువతిని ఒక కన్సల్టెన్సీ నిర్వహకుడు మోసం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే....కడిమెట్ల గ్రామానికి చెందిన రంగ మ్మ ఇంటర్ పాస్ అయింది. నర్స్ ట్రైనింగ్ చేయాలన్న లక్ష్యం ఉండటంతో నంద్యాలకు చెందిన కన్సల్టెన్సీ నిర్వహకుడు బాలాగ్రాం తాను తక్కువ ఖర్చుతో నర్స్ ట్రైనింగ్ చేయిస్తానని అమ్మాయి తండ్రికి చెప్పి నంద్యాలలో ఆర్‌ఆర్ క్రిష్టియన్ కళాశాలలో నర్సింగ్ కోర్సులో చేర్పించాడు. రెండో సంవత్సరం చదువుతుండగా 6నెలల క్రితం బాలుగ్రాం తన కార్యాలయంలో కాల్‌సెంటర్ ఉద్యోగం ఉందని చెప్పి ఉద్యోగంలో చేర్పించుకున్నాడు. యువతి ఉద్యోగంలో కొనసాగుతుండగా మీ అమ్మనాన్నలను బాగ చూసుకుంటానని, మనం పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. ఈ సందర్భంలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. దీంతో 2023 ఏప్రిల్ 14న మహానందిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని రోజుల తరు వాత బాలాగ్రాం సెల్‌ఫోన్‌లో ఒక మహిళ బాబుతో కలసి ఉన్న ఫోటోలను చూశారు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరని ప్రశ్నించగా.. వీరు తన భార్య, కుమారుడని తెలిపాడు. అంతేగాక తనకు ఇదివరకే పెళ్లి అయ్యిందని చెప్పాడు. దీంతో తాను మోస పోయానని గ్రహించి వెంటనే తన స్వగ్రా మానికి వచ్చింది. తనను మోసం చేసిన బాలాగ్రాంపై ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.