పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) సాంకేతిక, పరిశోధక (ఇన్వెస్టిగేషన్) సలహాదారుగా ప్రొఫెసర్ వీఎస్ రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయనకి గతంలో ఐఐటీ ఢిల్లీకి డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ మేరకు సోమవారం జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలో పోలరం ప్రాజెక్టు ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌తో సహా ఇతర సాంకేతిక అంశాలు, డిజైన్లు పరిశీలన నిమిత్తం రూ.4.11 కోట్లను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.