గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు సహా అన్ని గురుకులాల పర్యవేక్షణ బాధ్యతలను సచివాలయాల పరిధిలోకి తీసుకువచ్చింది. వీటికి సంభందించిన ఆయా హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టం(ఎస్వోపీ)తో సమగ్ర మార్గదర్శకాలను సీఎస్ జవహర్‌రెడ్డి విడుదల చేశారు. అధికారులు, సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని, మూడు స్థాయిల్లో పర్యవేక్షణ చేయాలని సూచించారు.