ఏపీలో చిరు వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జగనన్న తోడు నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వరుసగా నాలుగో ఏడాది వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను వారి ఖాతాలకు జమ చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల మేర లబ్ధి జరుగనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేలు జమ అయ్యాయి.