ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జైలులో ఉన్న మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. గతంలో రాఘవ బెయిల్ పిటిషన్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ. అనారోగ్య కారణాలతో రాఘవకు నాలుగు వారాల పాటు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరవ్వాలని హైకోర్టు తెలిపింది.