మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాగా ఈ పిటిషన్ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు వివరాలు, డైరీని సీల్డ్ కవర్లో అందించాలని సీబీఐని ఆదేశించింది. అవినాష్, గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లను కలిపే వింటామని స్పష్టం చేసింది.