బెంగళూరులో రెండో రోజు విపక్షాల కీలక సమావేశం ప్రారంభమైంది. 26 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 50 మంది నేతలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కేరళ మాజీ సీఎం ఉమాన్ చాందీ మృతికి సంతాపం తెలిపింది. ఈ సమావేశంలో ఆరు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సీట్ల భాగస్వామ్యం, కూటమి పేరు, కామన్ మినిమమ్ ప్రోగ్రాం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. కూటమిని కోఆర్డినేట్ చేయడానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.