వచ్చే ఎన్నికల్లో బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమినే గెలిపిస్తారని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ‘‘2024, 2025 ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్డీఏనే విజయం సాధిస్తుంది. మహా ఘట్ బంధన్‌ను రాష్ట్ర ప్రజలు స్వాగతించడటం లేదు. అందుకే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో హజిపురా నుంచి నేనే పోటీ చేస్తా’’అని తెలిపారు.