విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వ వార్డు అభివృద్ధికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు అధికారులుతో విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకె రాజు మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డులో జరిగిన అభివృద్ధి పనులు పెండింగ్ పనులపై చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జోనల్ కమిషనర్ ఆర్. జి. వి క్రిష్ణ, 55వార్డు కార్పొరేటర్ కె. వి. యన్ శశికళ పాల్గొన్నారు.